Google Fit: ఫిజికల్ యాక్టివిటీ

3.3
668వే రివ్యూలు
100మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
PEGI 3
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

కొత్త Google Fitతో ఆరోగ్యకరమైన, మరింత ఉత్సాహవంతమైన జీవితాన్ని గడపండి!

మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఎంత సమయం చేయాలి, ఎలాంటి యాక్టివిటీలు చేయాలి వంటి విషయాలను తెలుసుకోవడం చాలా కష్టం. అందువలన, Google Fit మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే యాక్టివిటీ లక్ష్యం అయిన హార్ట్ పాయింట్స్‌ను మీకు అందించడానికి, ప్రపంచ ఆరోగ్య సంస్థతో (WHO), అలాగే అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌తో (AHA) కలిసి పని చేస్తోంది.

మీ గుండె వేగంగా కొట్టుకునేలా చేసే యాక్టివిటీల వలన మీ గుండెకు, మనస్సుకు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మీ కుక్కతో పాటు నడుస్తున్నప్పుడు దాని వేగానికి సమానంగా నడవడం వంటి ఒకింత శ్రమపడే యాక్టివిటీని ఒక నిమిషం పాటు చేస్తే మీకు ఒక హార్ట్ పాయింట్ లభిస్తుంది, పరిగెత్తడం లాంటి ఎక్కువ శ్రమపడే యాక్టివిటీలను చేస్తే రెట్టింపు పాయింట్‌లు లభిస్తాయి. హృద్రోగాల ప్రమాదాన్ని తగ్గించుకోవడం, మెరుగైన నిద్ర, సంపూర్ణ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం చూపినటువంటి, AHA, WHOలు సిఫార్సు చేసిన ఫిజికల్ యాక్టివిటీ స్థాయిని చేరుకోవడానికి, కేవలం వారానికి ఐదు రోజులలో 30 నిమిషాల పాటు వేగంగా నడవాలి.

Google Fit మీకు వీటిలో కూడా సహాయపడుతుంది:

మీ వర్క్అవుట్‌లను మీ ఫోన్ లేదా వాచ్ నుండి ట్రాక్ చేయడంలో
మీరు వ్యాయామం చేసినప్పుడు తక్షణమే వాటి గణాంకాలను పొందడం అలాగే మీ రన్‌లు, నడకలు ఇంకా బైక్ రైడ్‌లకు సంబంధించిన రియల్ టైమ్ గణాంకాలను చూడటంలో. మీ వేగం, గమనం, మార్గం ఇంకా మరిన్ని అంశాలను రికార్డ్ చేయడానికి, Fit మీ Android ఫోన్ సెన్సార్‌లు లేదా Wear OS by Google స్మార్ట్‌వాచ్ గుండె స్పందన రేటు సెన్సార్‌లను ఉపయోగిస్తుంది.

మీ లక్ష్యాలను మానిటర్ చేయండి
హార్ట్ పాయింట్స్, నడవాల్సిన అడుగుల లక్ష్యానికి సంబంధించి మీ రోజువారీ ప్రోగ్రెస్‌ను చూడండి. అన్ని వేళలా మీ లక్ష్యాలను చేరుకుంటున్నారా? గుండె ఆరోగ్యంగా, మనస్సు ప్రశాంతంగా ఉండటం కోసం, కోసం మీకు మీరే సవాలు చేసుకుంటూ తదనుగుణంగా మీ లక్ష్యాలను సులభంగా సరి దిద్దుకోండి.

మీ ప్రతి కదలికను లెక్కలోకి తీసుకోండి
మీరు రోజంతా నడిచినా, పరిగెత్తినా లేదా సైక్లింగ్ చేసినా, మీ Android ఫోన్ లేదా Wear OS by Google స్మార్ట్‌వాచ్ ఆటోమేటిక్‌గా గుర్తించి మీ యాక్టివిటీలను Google Fit జర్నల్‌కు జోడిస్తుంది, దీని ద్వారా మీ ప్రతి కదలికకు క్రెడిట్‌ను పొందుతారు. అదనంగా క్రెడిట్ కావాలా? నిర్దిష్ట స్పీడ్‌తో నడిచే వర్క్అవుట్, మ్యూజిక్‌కు తగినట్టు నడవడం ప్రారంభించడం ద్వారా మీ నడక వేగాన్ని పెంచండి. విభిన్న రకమైన వర్క్అవుట్‌ను ఆస్వాదించాలనుకుంటున్నారా? పైలేట్స్, రోయింగ్ లేదా స్పిన్నింగ్ వంటి యాక్టివిటీల లిస్ట్ నుండి దాన్ని ఎంచుకోండి, ఆపై Google Fit మీరు సంపాదించే హార్ట్ పాయింట్స్ అన్నింటినీ ట్రాక్ చేస్తుంది.

మీకు ఇష్టమైన యాప్‌లతో, పరికరాలతో కనెక్ట్ అవ్వండి
మీ ఆరోగ్యానికి సంబంధించి మీకు సమగ్ర వీక్షణను అందించడం కోసం, Fit మీకు ఇష్టమైన అనేక యాప్‌లు, పరికరాల నుండి మీకు సమాచారాన్ని చూపగలదు, తద్వారా మీరు క్రమం తప్పకుండా మీ ప్రోగ్రెస్‌ను ట్రాక్ చేయవచ్చు. వీటిలో Lifesum, Wear OS by Google, Nike+, Runkeeper, Strava, MyFitnessPal, Basis, Sleep as Android, Withings, Xiaomi Mi బ్యాండ్‌లు ఇంకా మరిన్ని ఉంటాయి.

ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా చెక్ ఇన్ చేయండి
అలాగే మళ్ళీ కొత్తగా రూపొందించినటువంటి జర్నల్‌లోని మీ అనుసంధానించబడిన యాప్‌లలో ఇంకా Fitలో మీ యాక్టివిటీ హిస్టరీకి సంబంధించిన స్నాప్‌షాట్‌ను చూడండి. లేదా బ్రౌజ్‌లో పూర్తి వివరాలను పొందండి, ఇక్కడ మీ ఆరోగ్యం, సంరక్షణ డేటా మొత్తాన్ని పొందవచ్చు.

మీ ఆరోగ్యాన్ని గమనించండి
టెన్షన్‌ను తగ్గించడానికి ఇంకా ఒత్తిడి నుండి బయటపడటానికి సరళమైన మార్గాలలో శ్వాస ఒకటి. Fit సహాయంతో, మీ శ్వాస రేట్‌ను చెక్ చేయడం సులభం—మీకు కావలసిందల్లా మీ ఫోన్ కెమెరా. మీ శరీర సంరక్షణను ఉత్తమంగా అర్థం చేసుకోవడానికి, మీ శ్వాస తీసుకునే రేటుతో పాటు, మీరు మీ గుండె స్పందన రేటును కూడా లెక్కించవచ్చు.

ఒక్కసారి మీ రోజువారీ గణాంకాలను చూడండి
మీ Android ఫోన్ మొదటి స్క్రీన్‌కు విడ్జెట్‌ను జోడించండి లేదా మీ Wear OS by Google స్మార్ట్‌వాచ్‌లో టైల్‌ను ఇంకా కాంప్లికేషన్‌ను సెటప్ చేయండి.

ఈ లింక్‌లో Google Fit గురించి మరింత తెలుసుకోండి, అలాగే సపోర్ట్ చేసే యాప్‌ల లిస్ట్‌ను చూడండి: www.google.com/fit
అప్‌డేట్ అయినది
2 అక్టో, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 6 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
స్వతంత్ర సెక్యూరిటీ రివ్యూ

రేటింగ్‌లు మరియు రివ్యూలు

3.2
622వే రివ్యూలు
Sd construction
17 అక్టోబర్, 2025
చాలాబాగుంది
ఇది మీకు ఉపయోగపడిందా?
వర ప్రసాద్
7 మే, 2025
👍
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Bheemaiah Goud
15 మార్చి, 2024
nice
ఇది మీకు ఉపయోగపడిందా?